Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రెచ్చిపోయిన కామాంధులు

ముగ్గురు మైనర్లపై సామూహిక అత్యాచారాలు
యూపీ, చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలో దారుణాలు

ఐపీసీపోక్సో కింద కేసుల నమోదు 27 మంది అరెస్టు పరారీలో మరికొందరు`కొనసాగుతున్న గాలింపులు
ముజఫర్‌నగర్‌ / రాయ్‌పూర్‌ /థానే : కామాంధుల ఆగడాలు రోజురోజుకు పేట్రేగిపోతున్నాయి. చట్టాలను ఎంత తీవ్రతరం చేసినా మానవుల రూపంలో ఉన్న మృగాలను అదుపు చేయడం ప్రభుత్వాల తరం కావడం లేదు. అభంశుభం తెలియని అమాయక బాలికలపై విరుచుకుపడి కామవాంఛ తీర్చుకునే వీళ్లను కఠినంగా శిక్షించడంలోనూ పూర్తిగా విఫలమవుతున్నాయి. ముక్కుపచ్చలారని చిన్నారులు, నిండు పదహారేళ్లైనా నిండని బాలికలపై సామూహిక అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా ‘రేప్‌ కేపిటల్‌ ఆఫ్‌ ఇండియా’గా చెప్పే ఉత్తరప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఇటువంటి దారుణాలు వెలుగు చూశాయి. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో 16ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. చత్తీస్‌గఢ్‌లో 14ఏళ్ల బాలికపైÑ మహారాష్ట్రలో 15 ఏళ్ల బాలికపై పలుమార్లు సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి 33 మందిపై కేసు నమోదు కాగా వీరిలో ఇద్దరు మైనర్లు సహా 26 మంది నిందితులు పట్టుబడ్డారు. ముజఫర్‌నగర్‌లో బుధవారం చెత్త పారవేయడానికి బయటకు వచ్చిన 16ఏళ్ల బాలికను తుపాకీ చూపి బెదిరించి అడవిలోకి లాకెళ్లి ఆమెపై ముగ్గురు అత్యాచారానికి తెగబడ్డారు. బాలిక కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యుడు ఆమెను కాపాడగలిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను నిలదీయగా బాలిక కుటుంబ సభ్యులపై వారు దాడి చేసినట్లు ఫిర్యాదులో ఉంది. రాజీవ్‌, గుడ్డు, ఆషు అనే ముగ్గురిపై కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో 14ఏళ్ల బాలికపై అత్యాచారం మంగళవారం జరిగిందని, 40ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశామరి స్థానిక పోలీసులు తెలిపారు. బాలిక తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో లోపలికి చొరబడి ఆమెపై అఘాయిత్యానికి నిందితుడు పాల్పడినట్లు చెప్పారు. జరిగినది కుటుంబ సభ్యులకు చెబితే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని బాలికను బెదరించినప్పటికీ ఆమె ఖామర్థి పోలీసులను ఆశ్రయించగా బుధవారం నిందితుడిని అరెస్టు చేశారు. ఐపీసీలోని 376, 506 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు పెట్టినట్లు పొలీసులు చెప్పారు. ఇక మహారాష్ట్రలోని థానే జిల్లాలో 15ఏళ్ల బాలికపై వేర్వేరు ప్రాంతాల్లో అనేకమార్లు సామూహిక అత్యాచారం ఎనిమిది నెలలపాటు జరిగింది. ఈ వ్యవహారంలో ఇద్దరు మైనర్లు సహా 26 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే విషయాన్ని సీనియర్‌ పోలీసు అధికారి వెల్లడిరచారు. కల్యాణ్‌లోని డొంబివిలి వద్ద మేరకు మంపాడా పోలీసులకు బుధవారం రాత్రిబాలిక ఫిర్యాదు చేయడంతో 33 మందిపై ఐపీసీలోని 376, 376 ఎన్‌, 376 డి, 376 (3) సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అదనపు పోలీసు కమిషనర్‌ (తూర్పు) దత్తాత్రేయ కరాలే గురువారం విలేకరులతో మాట్లాడారు. జనవరి 29 నుంచి సెప్టెంబరు 22వ తేదీ వరకు బాలికపై అనేకసార్లు అనేక చోట్ల సామూహిక అత్యాచారం జరిగిందన్నారు. బాలికను ఆమె ప్రియుడు జనవరిలో రేప్‌ చేసి, వీడియో తీయడంతో ఈ ఉదంతం మొదలైందని, అతను ఆ వీడియోను చూపి ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేసేవాడని, తన మిత్రులు, సహచరులతో కలిసి ఐదారుసార్లు ఆమెపై డొంబివిలి, బద్దాపూర్‌, ముర్దాబాద్‌, రాబలే ప్రాంతాల్లో సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడని తెలిపారు. ఏసీపీ సోనాలి ధోలే నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఈ కేసును విచారిస్తోందన్నారు. మొత్తం 33 మంది పేర్లను బాధితురాలు వెల్లడిరచగా అందులో ఇద్దరు మైనర్లు సహా 26 మందిని అరెస్టు చేశామని, బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని ఏసీపీ కరాలే వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img