Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణ నష్టం

ఓ రెస్టారెంట్‌ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ రెస్టారెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో భారత మాజీ క్రికెటర్‌ జహీరో ఖాన్‌ రెస్టారెంట్‌ ఉంది..కాగా జహీర్‌ ఖాన్‌ రెస్టారెంటుకు ఏదైనా నష్టం వాటిల్లిందో లేదో తెలియాల్సి ఉంది. కాగా పూణె నగరంలోని లుల్లా నగర్‌ చౌక్‌లో ఉన్న మార్వెల్‌ విస్టా భవనం పై అంతస్తులో ఉదయం 8.45 గంటల సమయంలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.ఈ ప్రమాదం కారణంగా ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఆస్తి నష్టంపై అంచనా వేయాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img