Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

అగ్ని నిరోధక రైల్వే కోచ్‌లు తయారీ


రైళ్లలో అగ్ని ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు అగ్ని నిరోధక (ఫైర్‌ రిటార్డెంట్‌) రైల్వే కోచ్‌లను అభివృద్ధి చేయాలని రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత రైల్వే ప్రధాన కర్మాగారమైన కపుర్తలా రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో ఈ ఫైర్‌ రిటార్డెంట్‌ రైల్వే కోచ్‌లను ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేస్తున్నారు. పనితీరును పరిశీలించి అంతా అనుకూలంగా ఉంటే మిగతా కోచ్‌లను కూడా ఫైర్‌ రిటార్డెంట్‌ కోచ్‌లుగా మార్పు చేస్తామని కపుర్తలా రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ మేనేజర్‌ రవీందర్‌ గుప్తా తెలిపారు. రైల్వే కోచ్‌లలో ఎంసీబీలు, లైట్స్‌, టెర్మినల్‌ బోర్డులు, కనెక్టర్లు తదితర ఎలక్ట్రికల్‌ ఫిట్టింగ్‌ల కోసం మెరుగైన మెటీరియల్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ కోచ్‌లలో చేసిన మార్పుల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం దాదాపుగా ఉండదని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img