Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రోజూ 1.25 కోట్ల వాక్సిన్‌లు : మోదీ

షిమ్లా : అత్యధిక జనాభా ఉన్న వివిధ దేశాలతో పోల్చితే భారత్‌ రోజుకు 1.25 కోట్ల వాక్సిన్‌లు అందజేస్తోందని సోమవారం ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ప్రయాణ సదుపాయాలు క్లిష్టతరంగా ఉన్నా, వాక్సిన్‌ ఫస్ట్‌ డోస్‌ను పంపిణీ చేసిన రాష్ట్రాల్లో హిమాచల్‌ప్రదేశ్‌ ముందువరుసలో ఉంటుందని ఆయన అన్నారు. అలాగే సిక్కిం, దాద్రా, నగర్‌హవేలీ వాటి లక్ష్యాలను సాధించి తరువాత వరుసలో నిలిచాయని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు ప్రధాని ఆరోగ్యశాఖ వర్కర్లు, లబ్దిదారులతో వీడియో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. తన కాలికి గాయమైనా కూడా ప్రజలకు సకాలంలో టీకాను పంపిణీ చేసిన హెల్త్‌ వర్కర్‌ కర్మోదేవిని ప్రధాని ప్రశంసించారు. ఇప్పటి వరకూ తాను 22,500 వాక్సిన్‌ డోసులు అందజేసినట్టు ఆమె ప్రధానికి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img