Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

రోడ్డు ట్రిప్‌లో చాయ్‌ బ్రేక్‌.. వీడియో పోస్ట్‌ చేసిన సచిన్‌ టెండూల్కర్‌

రోడ్‌ సైడ్‌ టీని ఎంజాయ్‌ చేశారు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌. ఆయన కుమారుడు అర్జున్‌తో కలిసి బెళగాం-గోవా జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ మార్గం మధ్యలో ఒక చోట ఆగారు. అక్కడ రోడ్డు పక్కన ఓ చాయ్‌ వాలాతో ముచ్చటించారు. అక్కడున్న వారితో సెల్ఫీలు తీసుకుంటూ.. సందడి చేశారు. అనంతరం అక్కడ చాయ్‌తాగి ఆ రుచిని ఎంజాయ్‌ చేశారు.ఇందుకు సంబంధించిన వీడియోను సచిన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘రోడ్‌ ట్రిప్‌లో చాయ్‌ బ్రేక్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img