Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

ఆగస్టులో రూ.1.112 లక్షల కోట్లు
న్యూదిల్లీ : గత రెండు నెలలుగా జీఎస్‌టీ వసూళ్లు లక్ష కోట్ల మార్కును దాటాయి. ఆగస్టు నెలలో ఏకంగా రూ .1.10 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ ఆదాయం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈమొత్వం ఈ ఏడాది కాలంలో సేకరించిన ఆదాయం కంటే 30 శాతం అధికమని పేర్కొంది. 2021 ఆగస్టులో లభించిన ఆదాయం రూ .1,12,020 కోట్లు కాగా ఇందులో సీజీఎస్టీ రూ. 20,522 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ. 26,605 కోట్లు, వస్తువుల దిగుమతి సుంకం రూ. 26,884 కోట్లతో సహా మొత్తం వచ్చిన ఇంటిగ్రేటెడ్‌ ఆదాయం రూ. 56,247 కోట్లుగా ఉందని పేర్కొంది. వస్తువుల దిగుమతిపై వచ్చిన రూ. 646 కోట్లతో సహా వివిధ సెస్సుల రూపంలో రూ .8,646 కోట్లుగా ఉందని పేర్కొంది. 2019 ఆగస్టులో వచ్చిన ఆదాయం రూ .98,202 కోట్లు అని దానితో పోలిస్తే తాజాగా 14 శాతం ఆదాయం వృద్ధి చెందిందని తెలిపింది. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయాన్న గత సంవత్సరంతో పోల్చి చూస్తే 27 శాతం ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. కోవిడ్‌ రెండె తరంగం ప్రాంరంభమవడంతో లక్ష కోట్లకిందకు జారిపోయిన జీఎస్టీ వసూళ్లు ఆంక్షలు సడలించిన నేపథ్యంలో జూలై, ఆగస్టు నెలల్లో లక్ష కోట్ల మార్కును దాటిందని తెలిపింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని చెప్పడానికి తాజా ఉదాహరణ అని స్పష్టం చేసింది. రానున్న నెలల్లోనూ జీఎస్టీ ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img