Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను ప్రశ్నిస్తున్న సీబీఐ

మాజీ రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను ఇవాళ సీబీఐ విచారిస్తోంది. ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ స్కామ్‌లో భాగంగా ఈ విచారణ కొనసాగుతోంది. పాట్నాలోని లాలూ కూతురు మీసా భారతి ఇంట్లో ఈ దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుతో లింకు ఉన్న లాలూ భార్య.. బీహార్‌ మాజీ సీఎం రబ్రీదేవిని సోమవారం సీబీఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే.

లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ప్రతిగా వారి నుంచి లాలూ, ఆయన కుటుంబసభ్యులు భూమలు తీసుకున్న కేసు(లాండ్‌ ఫర్‌ జాబ్‌)లో సీబీఐ ఇదివరకే కేసు నమోదు చేసింది. ఈ కేసులో లాలూ కూతుళ్లు మీసా, హేమలపై కూడా ఫిర్యాదులు ఉన్నాయి.తన తండ్రిని వేధిస్తున్నారని లాలూ కూతురు రోహిని ఆచార్యఆరోపించారు. తన తండ్రికి ఏం జరిగినా.. ఎట్టి పరిస్థితుల్లో ఎవర్ని సహించేది లేదని ఆమె వార్నింగ్‌ ఇచ్చారు. కాలం చాలా శక్తివంతమైందని, ఇది గుర్తుపెట్టుకోవాలని ఆమె ఓ ట్వీట్‌లో హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img