Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

లోక్‌సభలో నలుగురు ఎంపీల సస్పెండ్‌..

రాజ్యసభలోనూ నిరసనలు
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ఆరో రోజూ విపక్షాల నిరసనలతో ఉభయసభలు దద్దరిల్లాయి. ఉదయం రాష్ట్రపతి ప్రమాణస్వీకారం కోసం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో ఎంపీలు సమావేశం కావడంతో సభలు మధ్యాహ్నం వరకూ వాయిదా పడ్డాయి. అనంతరం సమావేశమైన ఉభయసభల్లోనూ విపక్షాలు ధరల పెరుగుదలతో పాటు ఇతర అంశాలపై చర్చకు పట్టుబట్టాయి. ప్రభుత్వం ఇందుకు అంగీకరించకపోవడంతో వారు ఆందోళనలు కొనసాగించారు.ఉదయం వాయిదా తర్వాత మధ్యాహ్నం లోక్‌సభ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించడంతో… ప్రతిపక్షాలు ద్రవ్యోల్బణం, కొన్ని నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపుపై నిరసనలు చేపట్టాయి. విపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ధరల పెరుగుదలపై చర్చకు డిమాండ్‌ చేయడంతో, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సభా నిబంధనలను ఉల్లంఘించవద్దని ఎంపీలను కోరారు. చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పిన స్పీకర్‌.. సభలోకి ప్లకార్డు తీసుకొచ్చే సభ్యులెవరినీ సభా కార్యక్రమాల్లో పాల్గొననివ్వబోమన్నారు.అయితే పలువురు ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేయడంతో లోక్‌ సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img