Friday, April 19, 2024
Friday, April 19, 2024

వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ ప్రమాదం-గేదెల యజమానులపై గుజరాత్‌ ఆర్పీఎఫ్‌ కేసు..

గుజరాత్‌ పోలీసుల తీరు మరోసారి చర్చనీయాంశమైంది. గుజరాత్‌లో ప్రయాణిస్తున్న ముంబై-గాంధీనగర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను గేదెల మంద ఢీకొన్న 24 గంటల తర్వాత, గుజరాత్‌ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్పీఎఫ్‌) పోలీసులు పశువుల యజమానులపై కేసు నమోదు చేశారు.అయితే గేదెల యజమానులను రైల్వే పోలీసులు ఇంతవరకు గుర్తించలేకపోయారు. దీంతో వారి కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు అహ్మదాబాద్‌లోని వత్వ-మణినగర్‌ రైల్వే స్టేషన్ల మధ్య వందేభారత్‌ రైలు మార్గంలో వచ్చిన గేదెల గుర్తుతెలియని యజమానులపై ఆర్‌పిఎఫ్‌ ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) నమోదు చేసిందని పశ్చిమరైల్వే సీనియర్‌ ప్రతినిధి (అహ్మదాబాద్‌ డివిజన్‌) జితేంద్ర కుమార్‌ జయంత్‌ వెల్లడిరచారు. రైల్వే చట్టం 1989లోని సెక్షన్‌ 147 ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ఆర్‌పిఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రదీప్‌ శర్మ తెలిపారు. నాలుగు గేదెలు మృతి చెందిన ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img