Friday, April 19, 2024
Friday, April 19, 2024

వచ్చే ఏడాది 5జీ స్పెక్ట్రమ్‌ వేలం

న్యూదిల్లీ : 5జీ స్పెక్ట్రమ్‌ వేలం వచ్చే ఏడాది ఏప్రిల్‌-మేలో జరిగే అవకాశం ఉందని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ గురువారం తెలిపారు. ‘మొదటి దశ సంస్కరణల్లో భాగంగా టెలికాం ఆపరేటర్ల కోసం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం ఉపశమన చర్యలు ప్రకటించింది. ప్రభుత్వం మరిన్ని సంస్కరణల శ్రేణిని తీసుకువస్తుంది. అలాగే రాబోయే 2-3 సంవత్సరాలలో టెలికాం నియంత్రణ వ్యవస్థ మారాలి’ అని వైష్ణవ్‌ చెప్పారు. ‘టైమ్స్‌ నౌ సమ్మిట్‌ 2021’లో మంత్రి మాట్లాడుతూ.. భారతదేశ టెలికాం రంగ నియంత్రణలో ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పేందుకు ఈ రంగంలో వరుస సంస్కరణలు తీసుకువస్తామని వైష్ణవ్‌ వెల్లడిరచారు. 5జి వేలం నిర్వహించేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) సంప్రదింపులు జరుపుతోందని వైష్ణవ్‌ పేర్కొన్నారు. ట్రాయ్‌ నివేదిక సమర్పించగానే వేలం జరుగుతుందని తెలిపారు. వచ్చే ఫిబ్రవరి`మార్చిలో ట్రాయ్‌ నివేదిక వస్తుందన్నారు. టెలికమ్యూనికేషన్స్‌ విభాగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 5జీ వేలంపాటలను నిర్వహించాలని పేర్కొంది. అయితే ట్రాయ్‌ తన అభిప్రాయాలను ఖరారు చేయడానికి ఎంత సమయం తీసుకుంటుందనే దానిపై వేలం ఆధారపడి ఉంటుంది కాబట్టి రాబోయే వేలం కోసం నిర్దిష్ట కాలక్రమాన్ని ఇవ్వడం ఈ దశలో కష్టం అని మంత్రి తెలిపారు. ‘కానీ ఈ రోజు, మా అంచనా.. ఏప్రిల్‌-మే నాటికి జరగవచ్చు.. నేను ముందుగా మార్చి అంచనా వేసినప్పటికీ సంప్రదింపులు సంక్లిష్టంగా ఉన్నందున, విభిన్న అభిప్రాయాలు వస్తున్నాయి’ అని చెప్పారు. వేలం సాంకేతికత-తటస్థంగా ఉండేలా చూడడానికి ప్రభుత్వం ఆసక్తిగా ఉందని, రాబోయే చాలా సంవత్సరాలకు స్థిరంగా ఉండే స్పెక్ట్రమ్‌ను ఇవ్వాలని కోరుకుంటోందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img