Friday, April 19, 2024
Friday, April 19, 2024

వరుసగా నాల్గో రోజూ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

వరుసగా నాల్గో రోజూ ఇంధన ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. దేశ రాజధాని ఢల్లీిలోని లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 102.39 గా ఉండగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ. 90.77 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.43కు లభిస్తుండగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ.98.48గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.103.07 చొప్పున ఉండగా.. డీజిల్‌ ధర రూ. 93.87 గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ. 100.01 ఉండగా.. డీజిల్‌ ధర రూ.95.31గా ఉంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.95 పలుకుతుండగా.. డీజిల్‌ ధర రూ.96.34గా ఉంది. లక్నోలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 99.23 ఉండగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ.90.96గా ఉంది.తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 106.51గా ఉంది. ఇదే సమయంలో లీటర్‌ డీజిల్‌ ధర రూ. 99.04గా ఉంది.విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.108.87 కు లభిస్తుండగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ.100.83 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర రూ.108.48 ఉండగా.. డీజిల్‌ ధర రూ. 100.42గా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img