Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వరుసగా రెండో రోజు 12 వేలకు పైగా కరోనా కేసులు..

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా క్రమంగా విస్తరిస్తోంది. వరుసగా రెండోరోజు 12వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా గణాంకాలను వెల్లడిరచింది. గడిచిన 24 గంటల్లో 5.19 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా… వారిలో 12,847 మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. వీటిలో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 4,255 కేసులు వచ్చాయి. కేరళలో 3,419 కేసులు, ఢల్లీిలో 1,323 కేసులు, కర్ణాటకలో 833 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో కరోనా నుంచి 7,985 మంది కోలుకోగా… 14 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 63,063కి పెరిగింది. కరోనా బారిన పడి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 5,24,817 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం 1,95,84,03,471 డోసుల కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 15.27 లక్షల మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img