Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వారు క్షమాపణ కోరితే సస్పెన్షన్‌ ఎత్తివేస్తాం

మంత్రి ప్రహ్లాద్‌ జోషి
రాజ్యసభలో 12 మంది విపక్ష ఎంపీలను ఎందుకు సభ నుంచి సస్పెండ్‌ చేయాల్సి వచ్చిందో తాము సభాముఖంగా వివరించామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. సభలో ఏం జరిగిందనే దానికి యావత్‌ దేశం సాక్షిగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు.ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదని, సస్పెన్షన్‌లో ఉన్న ఆ 12 మంది ఎంపీలు క్షమాపణ కోరితే.. వారిపై సస్పెన్షన్‌ ఎత్తివేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ఆఖరులో సభలో సదరు ఎంపీలు ప్రవర్తించిన తీరుకు శిక్షగా శీతాకాల సమావేశాల మొదటిరోజే రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలను సస్పెండ్‌ చేశారు. అయితే సస్పెన్షన్‌ ఎత్తివేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img