Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విద్యార్థులపై లాఠీఛార్జ్‌.. ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్‌ వేటు

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ నాన్‌-టెక్నికల్‌ కేటగిరీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షా ఫలితాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీహార్‌, యూపీ రాష్ట్రాల్లో విద్యార్థులు, యువత భారీగా ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో వారిని కట్టడి చేయటానికి పోలీసులు లాఠీచార్జీలు, టియర్‌గ్యాస్‌లను ప్రయోగించారు. ఎప్పటి నుంచో పెండిరగ్‌లో ఉన్న ఈ ఫలితాలను ఈ మధ్యే విడుదల చేయగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నలంద, నవాడ, సీతామర్హి, బక్సర్‌, అర్రా, ముజఫర్‌పూర్‌లలో అభ్యర్థులు రైల్వే ట్రాక్‌లపై బైఠాయించారు.కంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనవరి 14, 15వ తేదీల్లో విడుదలైన ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఫలితాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అభ్యర్థులు మూడు రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. ఆందోళనకారులు రైళ్లను ధ్వంసం చేయడంతోపాటు రైళ్లపైకి రాళ్లు రువ్వారు. బీహార్‌లోని గయా జంక్షన్‌లో భభువా-పట్నా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ని తగలబెట్టారు. దీంతో రైలులోని పలు భోగీలు దగ్దమయ్యాయి. ఈ ఆందోళనలతో స్పందించిన భారతీయ రైల్వే శాఖ ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, లెవల్‌ 1 పరీక్షలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. పరీక్షల్లో ఉత్తీర్ణులైన, ఫెయిల్‌ అయినవారి ఫిర్యాదులను పరిశీలించేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఈ కమిటీ రైల్వే శాఖకు నివేదిక సమర్పించనుంది.కాగాప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఆందోళన సమయంలో విద్యార్థులను కొట్టినందుకు ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్‌ వేటు పడిరది. సస్పెన్షన్‌కు గురైన ఆరుగురు పోలీసు సిబ్బందిలో ఒక ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img