Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విపక్షాలకు ఓటు బ్యాంకు భయం

అందుకే అహ్మదాబాద్‌ పేలుళ్ల తీర్పును స్వాగతించలేదు : మోదీ
అమేథి : అహ్మదాబాద్‌ పేలుళ్ల కేసులో తీర్పును ప్రతిపక్షాలు స్వాగతించలేదని, ఓటు బ్యాంకును కోల్పోతామన్న భయంతోనే వారు ఆ సాహసం చేయలేకపోయారని ప్రధాని మోదీ గురువారం వ్యాఖ్యానించారు. 2008 పేలుళ్ల కేసులో ఇండియన్‌ ముజాహిదీన్‌ సంస్థకు చెందిన వారంటూ 38 మందికి ఉరిశిక్ష విధిస్తూ అహ్మదాబాద్‌ ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల తీర్పును వెలువరించింది. మరో 11 మందికి యావజ్జీవ శిక్ష వేసింది. మోదీ అమేథి, సుల్తాన్‌పూర్‌ జిల్లాల్లో ఎన్నికల ర్యాలీల్లో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లో కుటుంబ పార్టీలే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. బీజేపీకి కుటుంబంతో పని లేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన నాలుగు దశల్లో ఓటర్లు బీజేపీని ఆశీర్వదించారని, ఓట్ల విభజనపై విపక్షాల అంచనాలు తప్పాయన్నారు. ఫిబ్రవరి 24 తనకు ఎంతో ప్రత్యేకమని, ఇదే రోజు మూడేళ్ల కింద పీఎం కిసాన్‌ యోజన అమల్లోకి వచ్చిందని, 20 ఏళ్ల కింద తొలిసారి ఎమ్మెల్యే అయ్యాయని మోదీ గుర్తుచేసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img