Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వివాదాస్పద మూడు చట్టాలివే..

ధరల హామీ-వ్యవసాయ సేవల బిల్లు (సాధికారత,రక్షణ) 2020-బిల్లు
ఈ బిల్లు కింద రైతులు పండిరచే పంటకు ముందుగానే ప్రైవేట్‌ కంపెనీలతో ఒప్పందంÑ నిర్ణీత కాలానికి ప్రైవేటు వ్యాపారి రైతుతో ఒప్పందం – పంటల కొనుగోలుÑ ఎవరికైనా రైతులు తమను పంట ఉత్పత్తులను అమ్ముకోవచ్చుÑ వ్యవసాయ రంగంలో సాంకేతికతకు పెద్దపీటÑ ప్రైవేటు వ్యాపారులతో ఒప్పందం ద్వారా ఐదు హెక్టార్ల లోపు భూమి ఉన్న చిన్న,సన్నకారు రైతులకు లబ్ది వంటి అంశాలు ఉన్నాయి.
నిత్యావసర వస్తువుల(సవరణ) బిల్లు 2020 బిల్లు
ఈ బిల్లుతో ధాన్యం, నూనె గింజలు, ఉల్లిగడ్డలు, బంగాళాదుంపలు నిత్యావసర వస్తువుల జాబితా నుంచి తొలగింపుÑ ఇష్టానుసారం ధరలు పెంచి అమ్మే పెద్ద కంపెనీల గుత్తాధిపత్యానికి తెరÑ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు అవకాశంÑ తద్వారా పోటీ వాతావరణం ఏర్పడి సప్లై చైన్‌ ఆధునీకరించబడే అవకాశంÑ కోల్ట్‌ స్టోరేజీలు,వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ఆధునిక సదుపాయాలను కల్పించే అంశాలున్నాయి.
వ్యవసాయ ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం
(ప్రోత్సాహం, సదుపాయకల్పన) బిల్లు-2020
ఈ చట్టంలో ఉత్పత్తుల అమ్మకాలు-కొనుగోళ్లకు రైతులు-ప్రైవేట్‌ వ్యాపారులకు స్వేచ్ఛÑ రైతులు తమ ఇష్టానుసారం ఎవరికైనా పంట ఉత్పత్తులను అమ్ముకోవచ్చు Ñ మార్కెట్‌ యార్డులకు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు Ñ కనీస మద్దతు ధర కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అవసరం లేదుÑ ధరల నియంత్రణ రైతులు-ప్రైవేట్‌ వ్యాపారుల చేతుల్లోనేÑ ప్రైవేటు వ్యాపారులే రైతు వద్దకు వచ్చి కొనుగోలుÑ మార్కెటింగ్‌/రవాణా ఖర్చులు,ఇబ్బందులు ఉండవుÑ అంతరాష్ట్ర వాణిజ్యం మరింత సులభతరం అయ్యే అంశాలున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img