Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

వీల్‌ చైర్‌లో కోర్టుకు హాజరైన లాలూ..

ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కేసులో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, రైల్వే శాఖ మాజీ మంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన భార్య రబ్రీదేవి, కుమార్తె, ఆర్జేడీ ఎంపీ మిసా భారతికి దిల్లీలోని ఓ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సీబీఐ ఈ కేసులో నిందితులను అరెస్ట్‌ చేయకుండానే కోర్టులో చార్జ్‌ షీటు దాఖలు చేసింది. కేసులో ప్రతి ఒక్కరూ రూ.50వేల చొప్పున వ్యక్తిగత బెయిల్‌ బాండ్‌ కింద జమ చేయాలని, ష్యూరిటీ కింద ఇంతే మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలని కోర్టు ఆదేశించింది. దిల్లీలోని రూజ్‌ అవెన్యూ కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా, లాలూ వీల్‌ చైర్‌ లో బుధవారం వచ్చారు. ఆయన వెంట భార్య, కుమార్తె ఉన్నారు. రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పనిచేసిన సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఆఫర్‌ చేసి, వారి నుంచి తక్కువకు భూములు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మూత్ర పిండాలు చెడిపోవడంతో, ఆయన కుమార్తె ఒక కిడ్నీ దానం చేయడం తెలిసిందే. ఇటీవలే సింగపూర్‌ లో కిడ్నీ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేసుకుని లాలూ తిరిగొచ్చారు. ప్రస్తుతం దాన్నుంచి కోలుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img