Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వేడెక్కిన బీహార్‌ రాజకీయాలు…

రేపు సీఎం నితీష్‌ కీలక సమావేశం
బీజేపీ, జేడీ(యూ) పక్షాల మధ్య విభజన చర్చ నేపథ్యంలో బీహార్‌ రాజకీయాలు మరో సారి వేడెక్కాయి. బీహార్‌ రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చీలిక వస్తుందనే ఊహాగానాల మధ్య ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మంగళవారం(రేపు) అఖిలపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.గత కొంతకాలంగా బీహార్‌ రాష్ట్రంలో సీఎం నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీ(యూ), బీజేపీల మధ్య విబేధాలు రాజుకున్నాయి.బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఢల్లీిలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశానికి గైర్హాజరయ్యారు.దీంతో జేడీ(యూ),బీజేపీల మధ్య చీలిక ఏర్పడుతుందనే పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లయింది. సీఎం నితీష్‌ కుమార్‌ గత కొన్ని నెలలుగా బీజేపీపై శీత కన్ను వేశారు.దీంతో ఆగస్ట్‌ 11వతేదీ లోపు బీహార్‌లో ఎన్డీఏ పాలన కూలిపోతుందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. జేడీ(యూ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాజీ మిత్రపక్షమైన ఆర్జేడీతో చేతులు కలుపుతుందనే ఊహాగానాలు ఏర్పడ్డాయి. బీహార్‌లో జేడీ(యూ)-బీజేపీ పొత్తు తెగిపోతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చాలా మంది జేడీ(యూ) ఎమ్మెల్యేలు మధ్యంతర ఎన్నికలకు విముఖత చూపుతున్నందున,బీహార్లో అధికారాన్ని నిలుపుకోవడానికి ఆ పార్టీ ఆర్‌జేడీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ ఫ్రంట్‌లతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోందని రాజకీయ వర్గాలు తెలిపాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img