Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వైద్య విద్యలో రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

వైద్య విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఎంబీబీఎస్‌, ఎండీ, ఎంఎస్‌, డిప్లొమా, బీడీఎస్‌, ఎండీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినవారికి 10 శాతం రిజర్వేషన్‌ కల్పించింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో దాదాపు 5,550 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని, వెనుకబడిన వర్గానికి , ఈడబ్ల్యుఎస్‌ విద్యార్థులకు రిజర్వేషన్లను కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా ప్రతి సంవత్సరం ఎంబీబీఎస్‌లో దాదాపు 1500 మంది ఓబిసి విద్యార్థులకు, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో 2500 మంది ఓబిసి విద్యార్థులకు, ఎంబీబీఎస్‌లో 550 మంది ఈడబ్ల్యుఎస్‌ విద్యార్థులకు, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో 1000 మంది ఈడబ్ల్యుఎస్‌ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని వెల్లడిరచింది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 26న ఓ సమావేశాన్ని నిర్వహించారు, చాలా కాలం నుంచి పెండిరగ్‌లో ఉన్న ఈ సమస్యకు సమగ్ర పరిష్కారాన్ని కనుగొనాలని సంబంధిత మంత్రిత్వ శాఖలను ఆదేశించారు. మోదీ గురువారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో ఈ వివరాలను తెలిపారు. తమ ప్రభుత్వం మైలురాయిలాంటి నిర్ణయం తీసుకుందని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img