Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

శక్తిమిల్స్‌ అత్యాచారం దోషులకు ఊరట

ఉరిని జీవితఖైదుగా మారుస్తూ బోంబే హైకోర్టు తీర్పు
ముంబై : సెంట్రల్‌ ముంబైలోని శక్తి మిల్స్‌లో 22 ఏళ్ల ఫొటో జర్నలిస్టు అత్యాచారం కేసులో ముగ్గురు దోషులకు బోంబే హైకోర్టు గురువారం ఊరట కలిగింది. దోషుల ఉరిశిక్షను జీవితఖైదుగా మారుస్తూ తీర్పు వెల్లడిరచింది. దోషులు పశ్చాత్తాపం చెందినందున మరణశిక్షకు బదులు జీవితఖైదు విధిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. 2013లో ఫొటో జర్నలిస్టుపై నిందితులు సామూహక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. దోషులు విజయ్‌ జాదవ్‌, మొహమ్మద్‌ ఖాసిం షేక్‌, మొహమ్మద్‌ అన్సారీ ఉరిశిక్షను ఖరారు చేయాలన్న అభ్యర్ధనను జస్టిస్‌ సాధనా జాదవ్‌, జస్టిస్‌ పృథ్వీరాజ్‌ చవాన్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. అయితే, దోషులు సమాజంలో తిరగడానికి అర్హులు కాదని, వారికి పెరోల్‌ లేదా వేరే సెలవులు వర్తించవని ధర్మాసనం స్పష్టంచేసింది. జీవించినంత కాలం దోషులు జైలులో మగ్గాల్సిందేనని తెలిపింది. 2013లో సామూహిక అత్యాచారం జరిగే సమయానికి జాదవ్‌ వయసు 19 ఏళ్లు కాగా ఖాసిం షేక్‌ వయసు 21, అన్సారీ వయసు 28గా ఉంది. సామూహిక అత్యాచారం ఘటన సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని, అత్యాచారం మానవహక్కులను ఉల్లంఘించడమేనని, అదేసమయంలో దోషులకు ఉరిశిక్ష సరికాదని ధర్మాసనం పేర్కొంది. అత్యాచార బాధితురాలు శారీరకంగానే కాకుండా మానసికంగానూ బాధపడిరది. ఇది ముమ్మాటికీ మానవహక్కుల ఉల్లంఘనే. అయితే, ప్రజాగ్రహాన్ని పరిగణనలోకి తీసుకోవడం మంచిది కాదు. ప్రజాగ్రహం లేదా ప్రజాభిప్రాయం ఆధారంగా తీర్పు ఇవ్వడం సరికాదని ధర్మాసనం తేల్చిచెప్పింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img