Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

శివశంకర్‌ మాస్టర్‌కు అండగా సోనూసూద్‌..

చెన్నై : ప్రముఖ సీనియర్‌ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌కు సినీ నటుడు, రియల్‌ హీరో సోనూసూద్‌ అండగా నిలిచారు. తాజాగా, శివశంకర్‌ మాస్టర్‌ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఆయన కుటుంబ పరిస్థితి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కారణంగా సినీ ప్రముఖులు ఎవరైనా వారికి సాయం చెయ్యాలి అనుకుంటే చేయవచ్చునని శివశంకర్‌ మాస్టర్‌ కొడుకు అజయ్‌ కృష్ణ తెలిపారు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న సోనూసూద్‌ మాస్టర్‌ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇప్పటికే తాను వారి కుటుంబంతో మాట్లాడుతున్నానని మాస్టర్‌ను కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తానని తాజాగా ట్వీట్‌లో సోనూసూద్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img