Friday, April 19, 2024
Friday, April 19, 2024

షింజో అబే మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

రేపు ‘జాతీయ సంతాపదినం’గా ప్రకటన
జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది మాటల కందని విషాదంగా మోదీ పేర్కొన్నారు. ఓ గొప్ప నేతను ప్రపంచం కోల్పోయిందంటూ మోదీ వరుస ట్వీట్లు చేశారు.షింజో అబేతో తనకు ఉన్న స్నేహం గురించి ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. జపాన్‌- ఇండియా సంబంధాల బలోపేతానికి అబే కృషి చేశారని.. జపాన్‌- ఇండియా అసోసియేషన్‌ చైర్మన్‌ గా బాధ్యతలు తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధం బలపడేందుకు సహకారం అందించారని అన్నారు. భారతదేశం ఈ కష్ట సమయంలో జపాన్‌ సోదర సోదరీమణులకు సంఫీుభావంగా నిలుస్తుందని అన్నారు. షింజో అబే కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండే తనకు షింజో అబేతో అనుబంధం ఉందని, ప్రధాని అయిన తర్వాత మా స్నేహం కొనసాగిందని..ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ వ్యవహారాలపై ఆయన అవగాహన చాలా లోలైనదని అన్నారు. ఇటీవల టోక్యో వెళ్లిన సమయంలో తన స్నేహితుడు షింజో అబేను కలుసుకున్న ఫోటోను ట్విట్టర్‌ లో షేర్‌ చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత్‌, జపాన్‌ మధ్య దైపాక్షిక బంధాన్ని బలోపేతం చేయడానికి కృషి చేశారని.. భారత్‌ సన్నిహిత మిత్రుడిని కోల్పోయిందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img