Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

సరిహద్దు ప్రవేశాలపై కర్ణాటక ఆంక్షలను తప్పుబట్టలేం : సుప్రీం

న్యూదిల్లీ : కేరళ నుంచి కాసర్‌గోడ్‌`మంగళూరు సరిహద్దుల్లో ప్రవేశాన్ని కోవిడ్‌ ప్రతికూల (ఆర్‌టి-పిసిఆర్‌ టెస్టు) నివేదిక కలిగిన వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. కోవిడ్‌ ఇంకా ముగియలేదని, విధించిన షరతులు అసమంజసమైనవి కావని ప్రజా ప్రయోజనాల కోసం జారీ చేయబడ్డాయని న్యాయమూర్తులు ఎల్‌ నాగేశ్వరరావు, బీఆర్‌ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘‘కేరళ రాష్ట్రం నుండి కర్ణాటక రాష్ట్రానికి వ్యక్తుల తరలింపు హక్కులు పరిమితం కాలేదు. కాసర్‌గోడ్‌ జిల్లాలో మంగళూరు లేదా కర్ణాటకలోని ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి వ్యక్తుల ప్రాథమిక హక్కులకు ఎటువంటి ఉల్లంఘన లేదు. కర్ణాటక సర్క్యులర్‌లు ప్రజారోగ్యం దృష్ట్యా జారీ అయిననవి కాబట్టి మేము జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణం కనిపించదు’’ అని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై కర్ణాటక ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు పిటిషనర్‌కు సుప్రీంకోర్టు స్వేచ్ఛనిచ్చింది.
కేరళ ఎమ్మెల్యే తరఫు న్యాయవాది హరీస్‌ బీరన్‌ వాదనలు వినిపిస్తూ కాసర్‌గోడ్‌లోని ప్రజలు విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం మంగళూరు నగరంపైనే ఆధారపడుతున్నారని తెలిపారు. కర్ణాటక జారీ చేసిన సర్క్యులర్‌లు ్ల ప్రతిరోజూ వారు మంగళూరుకు ప్రయాణించలేకపోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను బీరన్‌ ప్రస్తావించారు, ఇది గాలి, నీరు లేదా రహదారి ద్వారా వ్యక్తులు మరియు వస్తువుల అంతర్రాష్ట్ర తరలింపుపై ఎటువంటి ఆంక్షలు విధించవద్దని కేంద్రం కోరింది.
కాసర్‌గోడ్‌, మంగళూరు సరిహద్దుల్లో కేరళ నుంచి ప్రవేశాన్ని పరిమితం చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్‌లను కొట్టివేసిన కేరళ హైకోర్టు సెప్టెంబర్‌ 28న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మంజేశ్వర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏకేఎం అష్రఫ్‌ దాఖలు చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img