Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సహజీవనం, స్వలింగ సంపర్కుల రూపంలోనూ కుటుంబ సంబంధాలు

: సుప్రీంకోర్టు కొత్త నిర్వచనం
కుటుంబం అంటే తండ్రి, తల్లి, పిల్లలనే సంప్రదాయ భావన ఉందని, దీనికి భిన్నమైన రూపాల్లోనూ కుటుంబ సంబంధాలు ఉండొచ్చని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అటువంటి బంధాలకు చట్టపరమైన రక్షణ అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.ఈ భిన్నమైన రూపాల కిందకు అవివాహిత భాగస్వామ్యాలు , స్వలింగ సంపర్కం లాంటి సంబంధాలు వస్తాయని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ , జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నల ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘కుటుంబ నిర్మాణంలో మార్పుకు దారితీసే అనేక పరిస్థితులు, కుటుంబాలు ఈ అంచనాకు అనుగుణంగా ఉండవు.. కుటుంబ సంబంధాలు అవివాహిత భాగస్వామ్యాలు లేదా స్వలింగ సంపర్కం రూపంలో ఉండవచ్చు’’ అని పేర్కొంది.గత వివాహ బంధంలో భర్తకు పుట్టిన ఇద్దరు పిల్లల్లో ఒకరి సంరక్షణకు మహిళ మెటర్నటీ లీవ్‌ తీసుకున్నందున, ఇప్పుడు తాను జన్మనిస్తున్న బిడ్డకు చట్టపరంగా సెలవును నిరాకరించడం సరికాదని ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 2018లో స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన తర్వాత ఎల్జీబీటీ వివాహాలు, పౌర సంఘాలను గుర్తించడంతోపాటు సహజీవనంలో ఉన్న జంటలు దత్తత తీసుకోవడానికి అనుమతించే అంశాన్ని సామాజిక హక్కులు లేవనెత్తుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జీవిత భాగస్వామి మరణం, విడిపోవడం లేదా విడాకులు వంటి ఏవైనా కారణాల వల్ల ఒంటరిగా ఉండవచ్చు.. అదే విధంగా, పిల్లల సంరక్షకులు (సాంప్రదాయంగా తల్లి లేదా తండ్రి పాత్రలను ఆక్రమిస్తారు) పునర్వివాహం, దత్తత లేదా పెంపకంతో మారవచ్చు’ అని పేర్కొంది. ప్రేమ, కుటుంబాల వ్యక్తీకరణలు విలక్షణమైనవి కాకపోవచ్చు.. అయితే భిన్నమైన కుటుంబ బంధం చట్టపరంగా రక్షణకు మాత్రమే కాకుండా సాంఘిక సంక్షేమ చట్టం ప్రకారం లభించే ప్రయోజనాలకు అర్హమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img