Friday, April 19, 2024
Friday, April 19, 2024

సహజీవనానికి కనీస వయసును తగ్గించేది లేదన్న కేంద్ర ప్రభుత్వం

యువతీయువకులు ఏకాభిప్రాయంతో సహజీవనం చేయడానికి కనీస వయసు 18 ఏళ్లు ఉండాలనే నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. ఈ నిబంధనలో ఎలాంటి మార్పు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సహజీవనానికి కనీస వయసును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం లేదని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంటులో లిఖితపూర్వకంగా తెలిపారు. 2012లో రూపొందించిన పోక్సో చట్టం (పిల్లలను లైంగిన వేధింపులు, లైంగిక నేరాల నుంచి రక్షించే చట్టం) 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారిని పిల్లలుగా స్పష్టంగా నిర్వచించిందని ఆమె చెప్పారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో డేటా ప్రకారం బాల్య వివాహాలు గత కొన్నేళ్లుగా పెరిగాయని, ఇది విచారించదగ్గ అంశమని అన్నారు. వీటిని తగ్గించడానికి బేటీ బచావో బేటీ పడావో, మహిళా హెల్ప్‌ లైన్‌ వంటి కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img