Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సివిల్‌ సర్వీసెస్‌కు దివ్యాంగులు అర్హులు ఎలా..?

కేంద్రం సమాధానం కోరిన ‘సుప్రీం’
వివిధ కేటగిరిల్లో సివిల్‌ సర్వీసెస్‌లో దివ్యాంగులకు అవకాశం కల్పించే అంశంపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఓ వ్యాజ్యంపై బుధవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపిన జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌, వీ రామసుబ్రహ్మణ్యంతో కూడిన ధర్మాసనం వైకల్యంపై సానుభూతి ఒక అంశం అయితే, ప్రాక్టికాలిటీని సైతం గుర్తుంచుకోవాలని పేర్కొంది.దివ్యాంగులు అన్ని కేటగిరిలకు సరిపోరని కోర్టు అభిప్రాయపడిరది. ఈ సందర్భంగా కోర్టు ఓ ఘటనను ప్రస్తావించింది. చెన్నైలో వందశాతం అంధుడిని జూనియర్‌ విభాగంలో సివిల్‌ జడ్జిగా నియమించారని, తర్వాత తమిళ పత్రికకు సంపాదకుడిగా పని చేశారని గుర్తు చేసింది. అయితే, సివిల్‌ సర్వీసెస్‌లోని వివిధ కేటగిరీలలో దివ్యాంగుల పాత్రపై విచారణ జరుపుతున్నట్లు కేంద్రం పేర్కొంది. ఈ విషయంలో సమయం కోరగా.. ఈ మేరకు కేంద్రానికి ఎనిమిది వారాల సమయం ఇచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img