Friday, April 19, 2024
Friday, April 19, 2024

సీఎన్‌జీ ధర పెంపుపై ఆందోళన

జంతర్‌ మంతర్‌ వద్ద డ్రైవర్ల ధర్నా
నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరిక

న్యూదిల్లీ: సీఎన్‌జీ ధరల పెరుగుదలపై క్యాబ్‌, ఆటో డ్రైవర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎన్‌జీ ధరలు తగ్గించండి లేదా తమ చార్జీలు సవరించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం జంతర్‌ మంతర్‌ వద్ద వందలాదిమంది డ్రైవర్లు ధర్నాకు దిగారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని..ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకోవాలని సర్వోదయ డ్రైవర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రవి రాథోడ్‌ డిమాండ్‌ చేశారు. సీఎన్‌జీ ధర కిలో రూ.70కు చేరిందని, అయినా ఇప్పటికీ తాము పాత చార్జీలతోనే ఆటోలు, క్యాబ్‌లు నడుపుతున్నామని రాథోడ్‌ పీటీఐకి చెప్పారు. ఆకాశాన్నంటుతున్న సీఎన్‌జీ ధరలతో క్యాబ్‌లు, ఆటోలు నడపటం కష్టమవుతుందన్నారు. గడచిన 78 ఏళ్లుగా పెండిరగ్‌లో ఉన్న చార్జీలను సవరించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. చార్జీలు సవరించకపోతే సీఎన్‌జీ ధరఉ తగ్గించాలని రాథోడ్‌ డిమాండ్‌ చేశారు. దిల్లీఎన్‌సీఆర్‌ పరిధిలో తమ యూనియన్‌లో సభ్యులుగా నాలుగు లక్షలమంది డ్రైవర్లు ఉన్నారని తెలిపారు. తమ ఆందోళన ముగిసిన తర్వాత అంతా సమావేశమై నిరవధిక సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ‘ఈ రోజు మేము చేస్తున్న ఆందోళన కేవలం ప్రారంభం మాత్రమే. నిరసన కార్యక్రమం పూర్తయిన తర్వాత మేమంతా సమావేశమవుతాం. నిరవధిక సమ్మెకు వెళదామా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. ఆటోలు, క్యాబ్‌లు ఈ రోజు నడుపుతాం’ అని ఆయన వివరించారు.
మరోవైపు, సీఎన్‌జీపై కేజీకి రూ.35 సబ్సిడీ ఇవ్వాలన్న తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే ఏప్రిల్‌ 18 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఇతర ఆటో, ట్యాక్సీ యూనియన్లు హెచ్చరించాయి. దిల్లీ పరిధిలో కిలో సీఎన్‌జీ ధర రూ.69.11కి పెరిగింది. కేవలం నెల రోజుల్లోనే 13 రూపాయలు పెరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img