Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సీజేఐ ఎన్వీ రమణకు బహిరంగ లేఖ

ఏపీ ప్రభుత్వ మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఐవైఆర్‌ సంతకాలు
సస్పెన్షన్‌కు గురైన భారతీయ జనతా పార్టీ నాయకురాలు నుపుర్‌ శర్మ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆమెపై దాఖలైన పిటీషన్‌పై విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తమౌతోంది. మహ్మద్‌ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల దేశంలో అనిశ్చిత, అవాంఛనీయ పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ పార్డీవాలా ఆదేశించారు.
దీనిపై పలువురు రిటైర్డ్‌ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్స్‌, మాజీ సైనికాధికారులు స్పందించారు. న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు. మొత్తంగా 15 మంది రిటైర్డ్‌ న్యాయమూర్తులు, 77 మంది బ్యూరోక్రాట్స్‌, మరో 25 మంది సైనికాధికారులు ఈ లేఖపై సంతకాలు చేశారు. దీన్ని సీజేఐ ఎన్వీ రమణకు పంపించారు. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్‌ కృష్ణారావు, ఎల్వీ సుబ్రహ్మణ్యం, దినేష్‌ కుమార్‌, మాజీ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ కే అరవింద రావు, ఉమేష్‌ కుమార్‌ ఉన్నారు. తెలంగాణ క్యాడర్‌కు చెందిన రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి అలోక్‌ శ్రీవాస్తవ ఉన్నారు. నుపుర్‌ శర్మపై దాఖలైన పిటీషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జేబీ పార్డీవాలా చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమైనవిగా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img