Friday, April 19, 2024
Friday, April 19, 2024

సుమారు 1800 మంది ఉద్యోగులను తొలగించిన మైక్రోసాఫ్ట్‌

సుమారు 1800 మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్‌ తొలగించింది. కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మార్పుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. జూన్‌ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం లక్షా 80వేల మంది ఉద్యోగుల్లో సుమారు ఒక శాతం మందిపై వేటు వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొంతకాలం అనంతరం మైక్రోసాఫ్ట్‌ పునర్నిర్మాణంలో భాగంగా మరింతమందిని నియమించుకుంటుందని ఆ వర్గాలు తెలిపాయి. కన్సల్టింగ్‌, కస్టమర్‌, పార్టనర్‌ సొల్యూషన్‌ సహా పలు గ్రూపులలో ఈ తొలగింపులు చేపట్టింది. అమెరికాలో జులై 4 సెలవులు తరువాత తాజా ఉద్యోగ కోతలను ప్రకటించింది. అయితే చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉద్యోగులను తొలగించామని మైక్రోసాఫ్ట్‌ వివరించింది. పెట్టుబడుల విస్తరణ కొనసాగుతుందని, ఫలితంగా మళ్లీ ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటామని ఆ సంస్థ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img