Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సెప్టెంబరు నాటికి స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌!

సెప్టెంబరు నాటికి దేశంలో స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ను మాస్కోలోని గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ రష్యన్‌ డెవలప్‌మెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. పరాగ్వేలో స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ 93.5 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించిందని ఆర్‌డీఐఎఫ్‌ బుధవారం తెలిపింది. రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌తో ఒప్పందం చేసుకున్న పనాసియా బయోటెక్‌ స్పుత్నిక్‌ లైట్‌ అత్యవసర వినియోగం కోసం డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి కోరింది.స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ రష్యా, యూఏఈ, ఘనాతో పాటు ఏడు దేశాల్లో జరిగాయి. కొవిడ్‌ అన్ని వేరియంట్లపై వ్యాక్సిన్‌ ప్రభావంతంగా పని చేస్తుందని గమలేయా సెంటర్‌ తెలిపింది. స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ సింగిల్‌ డోస్‌ కావడంతో టీకాలు వేసేందుకు సహాయపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img