Friday, April 19, 2024
Friday, April 19, 2024

సైరస్‌ మిస్త్రీ సీటు బెల్టు పెట్టుకోలేదు.. 9 నిమిషాల్లో 20 కిలోమీటర్ల ప్రయాణం..

ప్రాథమిక వివరాలు వెల్లడిరచిన పోలీసులు
ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన టాటాసన్స్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ మరణానికి అనేక కారణాలు వెలుగుచూస్తున్నాయి. అతివేగంతో వెళ్లటంతో పాటు, సీటు బెల్టు పెట్టుకోకపోవటం ప్రమాదానికి కారణంగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మరో వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసే ప్రయత్నంలో రాంగ్‌ సైడ్‌ వెళ్లటంతో పాటు అతివేగంతో అదుపు తప్పి మెర్సిడెస్‌ కారు డివైడర్‌ ను ఢీకోట్టినట్లు పోలీసులు తెలిపారు. మిస్త్రీ ప్రయాణిస్తున్న కారు 9 నిమిషాల వ్యవధిలో 20 కిలోమీటర్లు వెళ్లినట్లు గుర్తించారు.మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో చారోటి చెక్‌ పోస్టు దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సూర్యా నదిపై ఉన్న బ్రిడ్జ్‌పై మెర్సిడీజ్‌ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. 54 ఏళ్ల మిస్త్రీతో పాటు జహంగీర్‌ పండోల్‌ కూడా స్పాట్‌లో మృతిచెందాడు. అహ్మదాబాద్‌ నుంచి ముంబై తిరిగి వస్తున్న సమయంలో మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. ముంబైకి చెందిన గైనకాలజిస్ట్‌ అనహిత పండోల్‌ ప్రమాద సమయంలో కారును నడుపుతోంది. సైరస్‌ మిస్త్రీ, జహంగీర్‌ పండోల్‌లు కారులో వెనుక సీట్లో కూర్చున్నారు. అనహిత కారు నడుపుతుండగా, డేరియస్‌ పండోల్‌ ముందు సీట్లు కూర్చున్నాడు. కారును ఓ మహిళ నడుపుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ఎడమ వైపు నుంచి మరో వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేస్తున్న సమయంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్నట్లు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img