Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సోనియాతో సిద్ధూ భేటీ

పంజాబ్‌ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న పోరు

న్యూదిల్లీ : పంజాబ్‌ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు నడుమ మాజీ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ శుక్రవారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఇక్కడ ఆమె నివాసంలో కలిశారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పంజాబ్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి హరీష్‌ రావత్‌లు కూడా ఈ భేటీకి హాజరయ్యారని ఆ వర్గాలు తెలిపాయి. పార్టీ పంజాబ్‌ రాష్ట్ర విభాగ పునర్వ్యస్థీకరణ, అలాగే పార్టీలో సిద్ధూ కీలక పాత్ర పోషిస్తారన్న వార్తల నడుమ ఈ సమావేశం జరిగింది. అనంతరం రావత్‌ మాట్లాడుతూ సోనియా గాంధీ ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అది జరిగిన వెంటనే ఆయన ఆ పని చేపడతారని అన్నారు. పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా సిద్ధూ నియామక నిర్ణయం జరిగిందా అని ప్రశ్నించగా, రావత్‌ స్పందిస్తూ, ‘అది ఎవరు చెప్పారు..?’ అని అన్నారు. ‘కాంగ్రెస్‌ అధ్యక్షురాలికి పంజాబ్‌పై నా నివేదికను సమర్పించేందుకు ఇక్కడకు వచ్చాను. ఆమె త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటారు. నేను వచ్చి మీతో పంచుకుంటాను’ అని రావత్‌ తెలిపారు. ‘దయచేసి నా ప్రకటనను చాలా జాగ్రత్తగా చదవండి. అందులోని పదాలు, వాటి అర్థాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి’ అని కూడా అన్నారు. రావత్‌ ఇప్పుడు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ను శాంతింప జేసేందుకు, ఒక ఫార్ములాను రూపొందిం చేందుకు ఆయనతో సమావేశం కావచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా గురువారం సిద్ధూను పీసీసీ చీఫ్‌ను చేస్తున్నారా అని ప్రశ్నించినపుడు, ‘దాని చుట్టూ ఒక ఫార్ములా రూపొందుతోంది’ అని రావత్‌ అన్నారు. మీడియా ఆసక్తికర వార్తలను కోరుకుంటుందని, కానీ కాంగ్రెస్‌ సాధా రణంగా దాని అవసరం వరకు స్పందించదని తెలిపారు. సోనియాతో సమావేశంలో ఏం జరిగిందని ప్రశ్నించగా, కాంగ్రెస్‌ అధ్యక్షురాలికి ఒక రాష్ట్ర నాయకుడు ఏమి చెప్పారనేది అది వారి మధ్య మాత్రమే ఉంటుందని అన్నారు. అయితే సిద్ధూ మీడియాతో మాట్లాడకుండా సోనియా గాంధీ నివాసం 10, జన్‌పథ్‌ నుంచి వెళ్లిపోయారు. ఇదిలాఉండగా పార్టీలో సిద్ధూకి కీలక పాత్ర ఇచ్చే విషయంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఆ వర్గాలు పేర్కొంటు న్నాయి. కానీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రావత్‌ మాత్రం వాటిని తోసిపుచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీకి దోహదపడేలా సింగ్‌, సిద్ధూ కలిసి పని చేసేలా పార్టీ అధి ష్టానం ఒక శాంతి యుత సూత్రాన్ని రూపొందిస్తుందని రావత్‌ చెప్పారు. కాగా ఈ నాయకు లిద్దరూ పరస్పరం బహిరంగంగా విమ ర్శలు చేసుకుం టున్నారు. అలాగే సింగ్‌, సిద్ధూలు ఇద్దరూ చండీగడ్‌లో వారి అనుచరులతో సమాంతరంగా సమావేశాలు నిర్వహించారు. అయితే ముఖ్యమంత్రి అమ రీందర్‌ సింగ్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కొంతమందితో భేటీ అయ్యారు. ఇక సిద్ధూ పంజాబ్‌ మంత్రులు సుఖ్జిందర్‌ రంధవా, ట్రిప్టు రాజిందర్‌ బజ్వాలను అలాగే వారితో సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలను రంధవా నివాసంలో కలుసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img