Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

స్టార్ క‌మెడియ‌న్.. మ‌నోబాల క‌న్నుమూత‌

గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ప్ర‌ముఖ హాస్య న‌టుడు మ‌నోబాల క‌న్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. కమెడియన్‌గా మనోబాల తమిళంలోనే కాదు, దక్షిణాది భాషలకు సుపరిచితమే. తనదైన కామెడీతో ఆయన నవ్వులు పూయించారు. అంతేకాదు పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. మనోబాల మరణ వార్తతో చిత్ర పరిశ్రమతో తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా కోలీవుడ్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది.ప‌లువురు సంతాపం తెలియ‌జేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img