Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

స్టాలిన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

పెట్రోల్‌పై రూ.3 తగ్గింపు
చెన్నై : పెట్రో ధరలపై ఎంకే స్టాలిన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రో ధరల బారి నుంచి తమ రాష్ట్ర ప్రజలకు కొంత మేరకు ఊరట కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నుల్లోంచి మూడు రూపాయలు తగ్గిస్తూ డీఎంకే ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ లీటరు పెట్రోలుపై మూడు రూపాయలు తగ్గించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నిర్ణయంతో ఏడాదికి రూ.1,160 కోట్ల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుందని తెలిపారు. అయితే ధరల భారం నుంచి కార్మికులు, పేద, మధ్యతరగతి ప్రజలకు కొంత ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వీలైనంతమేరకు తగ్గిస్తామని సీఎం ఎంకే స్టాలిన్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img