Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

కొత్తగా 15,815 పాజిటివ్‌ కేసులు
దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అయితే పాజిటివ్‌ కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 16,561 పాజిటివ్‌ కేసులు నమోదవగా, శనివారం కొత్తగా 15,815 కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 4,42,39,372కు చేరాయి. ఇందులో 4,35,93,112 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,996 మంది మరణించారు. మరో 1,19,264 మంది కరోనాతో కన్నుమూశారు. కాగా, గత 24 గంటల్లో 20,018 మంది మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జవగా, 68 మంది మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 4.36 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక మొత్తం కేసుల్లో 0.27 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.54 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని వెల్లడిరచింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 207.71 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img