Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

హర్యానా హోం మంత్రిని ..బహిరంగంగా మందలించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. కాగా ఈ కార్యక్రమంలో హర్యానా హోం మంత్రి అనిల్‌ విజ్‌ సుదీర్ఘ ప్రసంగం చేశారు. దాంతో ఆయనని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సున్నితంగా మందలించారు. ఈ సమావేశంలో అనిల్‌ ఎనిమిదిన్నర నిమిషాలు ప్రసంగించగా.. షా ఆయనకు నాలుగుసార్లు అంతరాయం కలిగించారు. మాట్లాడేందుకు ఆయనకు ఐదు నిమిషాలు మాత్రమే కేటాయించారని గుర్తు చేశారు. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను అమిత్‌ షా ప్రారంభించారు. విజ్‌ స్వాగత ఉపన్యాసం చేశారు. హర్యానా చరిత్ర, హరిత విప్లవానికి దాని సహకారం, ఒలింపిక్స్‌లో రాష్ట్ర క్రీడాకారుల ప్రతిభ, రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన క్రీడా మౌలిక సదుపాయాల గురించి వివరించసాగారు. అలాగే, తన మంత్రి శాఖ ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహించే ఫిర్యాదుల పరిష్కార సెషన్‌ గురించి కూడా మాట్లాడారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img