Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

హిజాబ్‌ ధారణపై నిషేధం.. కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం నోటీసు

రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల్లో హిజాబ్‌ ధారణపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని వేసిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ హేమంత గుప్తా, సుధాన్షు దులియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. హిజాబ్‌ బ్యాన్‌ ఎత్తివేత అంశంపై వివరణ ఇవ్వాలని కోరుతూ కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఈ కేసును మళ్లీ సెప్టెంబర్‌ 5వ తేదీన విచారించనున్నట్లు కోర్టు తెలిపింది. క్లాస్‌రూమ్‌లో హిజాబ్‌ ధరించే అనుమతి ఇవ్వాలని ఉడిపిలోని ప్రభుత్వ కాలేజీ ముస్లిం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img