Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

హిమాచల్‌ప్రదేశ్‌లో కుంభవృష్టి..నలుగురు గల్లంతు, సిమ్లాలో ఒకరు మృతి

హిమాచల్‌ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుల్లు జిల్లా పార్వతి లోయలో ఉన్న చోజ్‌ ముల్లా వద్ద కుంభవృష్టి కురిసింది. దీంతో ఆ గ్రామంలో నలుగురు గల్లంతయ్యారు. పార్వతి నదిలో అకస్మాత్తుగా వరద పెరగడంతో సమీపంలో ఉన్న క్యాంపు సైట్లన్నీ కొట్టుకుపోయాయి. దీంతో కొందరు టూరిస్లు కొట్టుకుపోయి ఉంటారని స్థానికులు అంటున్నారు. ‘మలానాలో 25 మందిని కాపాడాం. ఒక మహిళ వరద నీటిలో కొట్టుకుపోయారు. హై రిస్క్‌ ప్రాంతాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన క్యాంపులను తొలగించాలని సీఎం ఆదేశించారు. 3-4 కిమీ వ్యవధిలో 100 మంది పర్యటకులను కాపాడాం. గల్లంతైన వారిని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ గాలిస్తోంది. సిమ్లాలో
మరోవైపు భారీ వర్షాల కారణంగా సిమ్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ రాయి కారు మీద పడడంతో ఓ మహిళ మృతి చెందింది. ఇద్దరు గాయపడ్డారు. దిల్లీ టన్నెల్‌ వద్ద ఈ ఘటన జరిగింది. మంగళవారం రాత్రి నుంచి సిమ్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో ఫిరోజ్‌పుర్‌-షిప్కీ జాతీయ రహదారిని మూసివేశారు. బ్రోనీ నుల్లాలో నీటి ప్రవాహం పెరగడంతో హైవేను బ్లాక్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img