Friday, April 19, 2024
Friday, April 19, 2024

12 ఏళ్లలోపు చిన్నారులకు కొవాగ్జిన్‌, కొర్బెవ్యాక్స్‌ వినియోగానికి సిఫార్సు

5 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారుల కోసం బయోలాజికల్‌-ఇ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ కొర్బెవ్యాక్స్‌, భారత్‌ బయోటెక్‌ టీకా ‘కొవాగ్జిన్‌’ వినియోగానికి ‘ఎన్‌టాగి’ స్టాండిరగ్‌ టెక్నికల్‌ సబ్‌ కమిటీ సిఫార్సు చేసింది. 5-12 ఏళ్లలోపు పిల్లలకు కొర్బెవ్యాక్స్‌ను వేయనుండగా, 6-12 ఏళ్ల మధ్య చిన్నారులకు కొవాగ్జిన్‌ టీకా ఉద్దేశించినది. 6 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు ఉపయోగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ భారత్‌ బయోటెక్‌కు ఏప్రిల్‌ 26న అనుమతి మంజూరు చేసింది. అదే నెలలో డీసీజీఐ నిపుణుల ప్యానెల్‌ 5 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు వేసేందుకు బయోలాజికల్‌-ఇ కొర్బెవ్యాక్స్‌కు అత్యవసర వినియోగ అనుమతిని మంజూరు చేయాలని సిఫార్సు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img