Friday, February 3, 2023
Friday, February 3, 2023

2019లో 37వేల రోడ్డు ప్రమాదాలు

న్యూదిల్లీ: 2019లో ట్రక్కులు లేదా లారీలకు సంబంధించిన 37,078 ప్రమాదాలు సంభవించాయని, 13,532 మంది మరణించారని కేంద్రప్రభుత్వం గురువారం పార్లమెంటుకు తెలియజేసింది. రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సంగతి వెల్లడిరచారు. 2018లో ట్రక్కులు లేదా లారీల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల సంఖ్య 57,441 ఉండగా, 23,868 మంది మరణించినట్లు ఆయన పేర్కొన్నారు. ట్రక్‌ డ్రైవర్లతో సహా డ్రైవర్ల ప్రయోజనాల కోసం రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ జాతీయ రహదారుల వెంబడి ఫుడ్‌ కోర్ట్‌, ట్రక్‌ పార్కింగ్‌ బేలు మొదలైన సౌకర్యాల ఏర్పాటు సహా అనేక చర్యలు తీసుకోవడంతో ప్రమాదాల సంఖ్య తగ్గిందని గడ్కరీ చెప్పారు. ఒక ప్రత్యేక ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ… ఫాస్ట్‌ట్యాగ్‌ సిస్టమ్‌లో,ఒక్కో వాహనానికి ఫీజు ప్లాజాను దాటడానికి 47 సెకన్లు పడుతుందని చెప్పారు. ఫీజు ప్లాజాల వద్ద ఫాస్ట్‌ట్యాగ్‌ వ్యవస్థను అమలు చేయడం వల్ల ఫీజు లావాదేవీల ప్రక్రియ సమయం 56 శాతం తగ్గిందని, ఒక్కో లేన్‌కు గంటకు 148 అదనపు వాహనాలను ప్రాసెస్‌ చేయడానికి ఫీజు ప్లాజా ఆపరేటర్‌కి వీలు కల్పిస్తుందని చెప్పారు. మాన్యువల్‌ రుసుము వసూలు విధానంతో పోలిస్తే ఉత్పాదకత 130 శాతం పెరిగిందని ఆయన అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 24, 2022 వరకు ఫాస్ట్‌ట్యాగ్‌ వసూళ్లు రూ. 32,451 కోట్లుగా ఉన్నట్లు గడ్కరీ వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img