Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

2020లో దేశంలో 81.2 లక్షల మరణాలు

సీఆర్‌ఎస్‌ గణాంకాల వెల్లడి
దేశంలో 2020లో 81.2 లక్షల మరణాలు నమోదయ్యాయని సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ (సీఆర్‌ఎస్‌) గణాంకాలు తెలిపాయి. అంతకుముందు ఏడాది (2019) తో పోలిస్తే ఈ మృతులు 6 శాతం అధికమని రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. 2019లో 76.4 లక్షల మృతులు నమోదయ్యాయి. 2020లో మరణాలు పెరగడానికి కరోనాయే కారణమని ఆర్‌జీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ ఏడాది 1.48 లక్షల మంది మహమ్మారికి బలయ్యారని తెలిపింది. 2021లో మరోనాతో 3.32 లక్షల మంది చనిపోయారని పేర్కొన్నది. కాగా, దేశంలో ఇప్పటివరకు 5,23,920 మంది బాధితులు వైరస్‌తో కన్నుమూశారు.2020లో మహారాష్ట్ర, బీహార్‌, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, అసోం, హర్యానాల్లో మరణాలు అత్యధికంగా నమోదయ్యాయని వెల్లడిరచింది.2020లో నమోదైన మొత్తం మరణాల్లో పురుషుల శాతం 60.2 కాగా, మహిళలు 39.8 శాతం ఉన్నారు. దేశంలో కొవిడ్‌ సమయంలో ప్రభుత్వం వెల్లడిరచిన (5,23,889) గణాంకాల కన్నా ఇంకా ఎక్కువ మరణాలు సంభవించాయన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనాలను కేంద్రం ఈ సందర్భంగా కొట్టివేసింది. మరణాలను అంచనావేసే విషయంలో వైఖరిని మార్చుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓకు వైద్య మంత్రిత్వశాఖ లేఖ రాసింది. భారత్‌లో నమోదైన మరణాల విషయంలో విశ్వసనీయత, కచ్చితత్వం ఉండే తమ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఇక జననాల విషయానికి వస్తే.. 2019 కంటే 2020లో జన్మించినవారి సంఖ్య 2.4 శాతం తగ్గింది. 2019లో 2.48 కోట్ల మంది జన్మించగా, 2020లో 2.42 కోట్ల మంది జన్మించినట్లు ఆర్‌జీఐ తెలిపింది. బీహార్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, సిక్కిం, అండమాన్‌ నికోబార్‌ దీవులు, జమ్ముకశ్మీర్‌, లడఖ్‌లో తప్ప మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదైన జననాలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నది. ఉత్తప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌, జార్ఖండ్‌, దిల్లీ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కేరళ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో 2019 నాటికంటే 2020లో నమోదైన జననాలు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img