Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

2024 తర్వాత కాంగ్రెస్‌ మాయం – అమిత్‌ షా

ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి తీవ్ర పదజాలంతో విమర్శలు చేయడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మండిపడ్డారు. రాహుల్‌ గాంధీ నాయకుడైనప్పటి నుండి ప్రతిపక్ష సభ్యుల స్థాయి రోజురోజుకు పడిపోతుందని అన్నారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఉపయోగించిన భాష, దేశవ్యాప్తంగా ప్రజల నుండి వచ్చిన స్పందన.. చూస్తుంటే, లోక్‌సభ ఎన్నికల తర్వాత టెలిస్కోప్‌లో చూసినా కాంగ్రెస్‌ కనిపించదని ఎద్దేవా చేశారు. 2019లో ప్రధాని మోడీని ఉద్దేశించి రాచహుల్‌ గాంధీ దుర్భాషలాడారు, ఫలితంగా కాంగ్రెస్‌ ప్రతిపక్ష హూదాను కోల్పోయిందని గుర్తుచేశారు. 2024లో ప్రజలు ఓటు హక్కు ద్వారా వారికి సరైన బుద్ధిచెబుతారని హెచ్చరించారు. అయితే ఈ సందర్భంగా అమిత్‌షా సదరు కాంగ్రెస్‌ నేత పేరుగానీ, అతను వాడిన పదజాలాన్ని గానీ ప్రస్తావించక పోవడం విశేషం. అయితే ఇది కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా ఇటీవల ప్రధానిని ’’నరేంద్ర గౌతమ్‌దాస్‌ మోడీ’’ అని ప్రస్తావించడం గురించేనని బీజేపీ నేతలు చెప్పారు. మోడీ పూర్తి పేరు నరేంద్ర దామో దర్‌దాస్‌ మోడీ, మధ్య పేరు దామోదరదాస్‌ తన తండ్రి పేరును సూచి స్తుంది. ఇది దేశం లోని అనేక ప్రాంతాలలో సాధారణం. దేశంలోని 80 కోట్ల మంది పేదల జీవితాల్లో సంతోషాన్ని తీసు కొచ్చి, భద్రత, అభివృద్ధికి భరోసా కల్పించిన ప్రధానిని ప్రపంచ వ్యాప్తంగా గౌరవిస్తున్నారని షా అన్నారు. అటు వంటి ప్రియమైన ప్రధానిపై ఈ రకమైన భాష ఉపయోగించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img