Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

40 వేల కరోనా కేసులు..

మరో 585 మంది మృతి
న్యూదిల్లీ : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 40,120 ఇన్ఫెక్షన్ల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 3,21,17,836కు చేరాయి. అయితే రికవరీ రేటు 97.46 శాతానికి పెరిగింది. ఇదిలాఉండగా శుక్రవారం ఉదయం 8 గంటలకు అందిన వివరాల ప్రకారం, మరో 585 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,30,254కు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. క్రియాశీల కేసులు 3,85,227కు క్షీణించాయి. మొత్తం కేసుల్లో ఇది 1.20 శాతమని, మార్చి, 2020 నాటి నుంచి ఇదే అత్యల్పమని వివరించింది. కాగా గురువారం 19,70,495 కొవిడ్‌ పరీక్షలతో దేశంలో ఇప్పటి వరకు 48,94,70,779 రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 2.04 శాతం. గత 19 రోజుల్లో ఇది మూడు శాతంకన్నా తక్కువ. వారాంతపు పాజిటివిటీ రేటు 2.13 శాతంగా నమోదయినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కరోనా మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 3,13,02,345 మంది కోలుకున్నారు. అయితే మరణాల రేటు 1.34 శాతంగా ఉన్నట్లు గణాంకాలు తెలిపాయి. అలాగే గురువారం ఉదయం వరకు 52.95 కోట్ల టీకా డోసులను పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img