Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

45 శాతం ఎమ్మెల్యేలు నేరచరితులే: ఏడీఆర్‌

న్యూదిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలలో 49శాతం మంది నేరచరితులేనని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్‌) వెల్లడిరచింది. ఇటీవల ఎన్నికలు ముగిసిన ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో గెలుపొందిన 690 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లను ఏడీఆర్‌ పరిశీలించింది. ఐదు రాష్ట్రాల నుంచి ఎన్నికైన 690మంది ఎమ్మెల్యేలలో 312మందిపై క్రిమినల్‌ కేసులున్నాయని పేర్కొంది. అందులో 232 మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్నాయి. మొత్తం 312మంది నేరచరిత ఎమ్మెల్యేలలో బీజేపీ నుంచి 134, సమాజ్‌వాదీపార్టీ నుంచి 71, ఆమ్‌ఆద్మీపార్టీ నుంచి 52, కాంగ్రెస్‌ నుంచి 24, ఆర్‌ఎల్‌డీ నుంచి ఏడుగురు ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే యూపీలో 51శాతం, పంజాబ్‌లో 50శాతం, ఉత్తరాఖండ్‌లో 27శాతం, మణిపూర్‌లో 23శాతం, గోవాలో 40శాతం ఎమ్మెలు నేరచరితులే. ఇక ఆస్తుల వివరాలకు వస్తే 690మందిలో 598 మంది కోటీశ్వరులేనని ఏడీఆర్‌ నివేదిక పేర్కొంది. ప్రతి ఎమ్మెల్యే సరాసరి ఆస్తుల విలువ రూ.8.7 కోట్లని వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img