Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

5జీ స్పెక్ట్రమ్‌ వేలం ప్రారంభం..

5జీ స్పెక్ట్రమ్‌ వేలం ప్రారంభమైంది. 4.3 లక్షల కోట్ల ఖరీదైన 72 గిటాహెట్జ్‌ల రేడియోతరంగాలను వేలం వేస్తున్నారు. ముఖేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో, సునిల్‌ మిట్టల్‌కు చెందిన భారతి ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా, గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీలు 5జీ స్పెక్ట్రమ్‌ కొనుగోలుకు పోటీపడుతున్నాయి. 4జీ కన్నా పది రేట్ల వేగంతో 5జీ స్పెక్ట్రమ్‌ ద్వారా డేటా ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన వేలం సాయంత్రం ఆరు గంటల వరకు సాగనున్నది. స్పెక్ట్రమ్‌ సిగ్నల్‌ పూర్తిగా అమ్ముడుపోయే వరకు వేలం నిర్వహించనున్నారు. కొన్ని రోజుల పాటు వేలం జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 5జీ స్పెక్ట్రమ్‌ వేలం ద్వారా సుమారు 70 నుంచి లక్ష కోట్ల వరకు అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నట్లు టెలికాం శాఖ తెలిపింది. వేలం కోసం జియో కంపెనీ ముందుగానే 14 వేల కోట్లు డిపాజిట్‌ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img