Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

500 మెయిల్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లను సూపర్‌ ఫాస్ట్‌ కేటగిరీలోకి మార్చిన కేంద్రం

భవిష్యత్‌ లో మరిన్ని అధునాతన సేవలు అందిస్తామన్న రైల్వేశాఖ
దేశంలో కొత్తగా 500 రైళ్ల వేగం పెరగనుంది. 500 మెయిల్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లను సూపర్‌ ఫాస్ట్‌ కేటగిరీలోకి మార్చుతూ భారతీయ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. మరో 130 రైళ్లను కూడా సూపర్‌ ఫాస్ట్‌ కేటగిరీలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆయా రైళ్లను సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లుగా మార్చడం ద్వారా ప్రయాణ సమయం 10 నిమిషాల నుంచి 70 నిమిషాల వరకు తగ్గనుందని రైల్వేశాఖ పేర్కొంది. కాగా మెయిల్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైళ్ల సమయపాలన 2021-22లో 75 శాతంగా నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 84 శాతం నమోదు కావడం పట్ల రైల్వే శాఖ హర్షం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు భవిష్యత్‌ లో మరిన్ని అధునాతన సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img