Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

75% పెరిగిన మహిళా ఎంఎస్‌ఎంఈలు

న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా మహిళల నేతృత్వంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈలు) సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో 4.9 లక్షల యూనిట్ల నుండి 2022 ఆర్థిక సంవత్సరంలో 75 శాతం పెరిగి 8.59 లక్షల యూనిట్లకు చేరుకుందని కేంద్రప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. ‘2020-21 సంవత్సరంలో 4.9 లక్షల మంది మహిళల నేతృత్వంలోని ఎంఎస్‌ఎంఈలు పోర్టల్‌లో నమోదు చేసుకోగా, 2021-22 సంవత్సరంలో (28.03.2022 వరకు) 8.59 లక్షల మంది మహిళల నేతృత్వంలోని ఎంఎస్‌ఎంఈలు రిజిస్టర్‌ అయ్యాయని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ్‌ భానుప్రతాప్‌ సింగ్‌ వర్మ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో వెల్లడిరచారు.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈలు)ల రిజిస్ట్రేషన్‌ కోసం ఉద్యోగ్‌ ఆధార్‌ మెమోరాండం దాఖలు చేసేందుకు పూర్వ ఉన్న ప్రక్రియ స్థానంలో ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్‌ విధానాన్ని ప్రభుత్వం ప్రభుత్వం జులై 2020లో తీసుకొచ్చింది. ‘ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్న మహిళల నేతృత్వంలోని ఎంఎస్‌ఎంఈల సంఖ్య గణనీయంగా పెరిగింది’ అని వర్మ చెప్పారు. అంతేకాకుండా, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద అందుబాటులో ఉన్న డేటా ప్రకారం… మార్చి 31, 2021 నాటికి షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల్లోని మొత్తం 211.65 కోట్ల ఖాతాలలో, 70.64 కోట్ల ఖాతాలు మహిళా ఖాతాదారులకు చెందినవని మంత్రి సమాధానంలో వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img