Friday, April 19, 2024
Friday, April 19, 2024

75 శాతం పోలింగ్‌ పెరగాలి

ఉపరాష్ట్రపతి వెంకయ్య పిలుపు
న్యూదిల్లీ : 2024లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల నాటికి ఓటింగ్‌ శాతాన్ని కనీసం 75 శాతానికి పెరిగేలా లక్ష్యాలను సిద్దం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం భారత ఎన్నికల కమిషన్‌ నిర్వహించిన 12 వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో వర్చువల్‌ విధానంలో పాల్గొని తన సందేశమిచ్చారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లుకాగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగును కనీసం 75 శాతానికి పెంచేలా లక్ష్యం పెట్టుకుందాయని పేర్కొన్నారు. ఓటు హక్కు మాత్రమే కాదని ఒక బాధ్యత అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. ఓటింగు శాతం పెరిగేలా అవగాహన కార్యక్రమాలు ద్వారా చైతన్యం పెంపొందించవచ్చునని పేర్కొన్నారు. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో కేవలం 44.87 శాతం మంది మాత్రమే ఓటు వేయగా 2019లో 67.40 శాతం మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారని గుర్తు చేశారు. అయితే 2019లో పురుషుల ఓటింగు కన్నా స్త్రీల ఓటింగు శాతం పెరగడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా ఓటింగ్‌ శాతం నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్‌ కూడా ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలోనూ గత ఏడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 74 నుంచి 84 శాతం వరకూ భారీ ఓటింగ్‌ నమోదవడం అభినందనీయమని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img