Friday, March 31, 2023
Friday, March 31, 2023

8న త్రిపురకు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీన త్రిపురకు వెళ్లనున్నారు. త్రిపురలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. గత నెలలో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌ జరగగా.. ఈనెల 2న ఫలితాలు వెలవడ్డాయి. రెండు రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగి అధికార పీఠాన్ని అధిరోహించనుంది. ముఖ్యంగా త్రిపుర రాష్ట్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. త్రిపురలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీకి 32 స్థానాలు వచ్చాయి. దాని మిత్రపక్షమైన ఐపీఎఫ్‌టీ ఒక స్థానం గెలుచుకుంది. త్రిపురలో మార్చి 8న కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందని త్రిపుర ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు మాణిక్‌ సాహా తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img