తొలిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టిన కంగనా రనౌత్ కు పార్లమెంటరీ కమిటీలో చోటు దక్కింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన కమిటీలో కంగనా పేరును చేర్చారు. ఈమేరకు పార్లమెంటరీ కమిటీల జాబితాతో రాజ్యసభ సెక్రటేరియట్ గురువారం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిఫెన్స్ కమిటీలో లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి మరోసారి చోటు దక్కింది. ఈ కమిటీకి బీజేపీ ఎంపీ రాధా మోహన్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. కాగా, మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి నాలుగు కమిటీల సారథ్య బాధ్యతలను కేంద్రం అప్పగించింది. విదేశీ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన కమిటీకి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్బీ విద్య, మహిళా, శిశు, యువత, క్రీడలకు సంబంధించిన కమిటీకి దిగ్విజయ్ సింగ్బీ వ్యవసాయం, పశువులు, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీకి చరణ్ జిత్ సింగ్ చన్నీబీ గ్రామీణం, పంచాయతిరాజ్ కమిటీకి సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వం వహిస్తారు. కాగా, ఏడుసార్లు ఎంపీగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి మాత్రం ఏ కమిటీలోనూ చోటు దక్కలేదు. ఇక బీజేపీ ఎంపీల సారథ్యంలో కీలకమైన రక్షణ, ఆర్థిక, హోం, బొగ్గు, గనులు, ఉక్కు, సమాచార, ఐటీ కమిటీలు ఉన్నాయి.